విశాఖపట్నం : కేజీహెచ్ సర్జరీ విభాగంలో జూనియర్ వైద్యుడు డాక్టర్ బొప్పరాజు శశినాథ్ (23) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజులుగా ఆహారం సరిగా తీసుకోలేదని, వృత్తిపరమైన ఒత్తిడి భరించలేకపోతున్నట్లు తనకు ఫోన్ చేసి చెప్పాడని శశినాథ్ తల్లి భవాని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఘటనపై విశాఖ వన్టేన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, వైద్యకళాశాల వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ శంకరమఠం ప్రాంతానికి చెందిన శశినాథ్ రెండు నెలల క్రితమే ఏఎంసీ సర్జరీ విభాగంలో మొదటి ఏడాది పీజీ కోర్సులో చేరారు. సోమవారం రాత్రి 10.30 సమయంలో విధినిర్వహణలో ఉండగా బాత్రూంకు వెళ్తున్నట్లు సిబ్బందికి చెప్పారు. అరగంటైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా శశినాథ్ రెండు చేతుల మణికట్ల వద్ద రక్తస్రావం జరుగుతూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదని, కేసు విచారణ దశలో ఉందని వన్లైన్ సీఐ పూడి వరప్రసాద్ తెలిపారు. శశినాథ్కు కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి తెలిపారు.
Also read
- నేటి జాతకములు 21 జూన్, 2026
- Lotus Flower: దేవతల ఆసనంగా తామర పువ్వే ఎందుకు? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకర రహస్యం
- గరుడ పురాణం: ఈ 7 మహాపాపాలు చేస్తే నరకంలో దారుణమైన శిక్షలు తప్పవు
- తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
- Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?





