హైదరాబాద్ మహానగరం జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులురెడ్డిపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, ఆమె స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులురెడ్డిపై BNSలోని 68, 64(2)(a)(m), 89, 74, 75, 77, 78, 115(2), 308, 351(3)తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66(E), 67, 67(A) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
శ్రీనివాసులు రెడ్డి తనను లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నారని, అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. తనకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి వాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొంతకాలం తనతో సహజీవనం చేసిన ఆయన, ఆ తర్వాత తనను వదిలించుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
ఈ ఫిర్యాదుపై అధికారులు చేపట్టిన విచారణలో శ్రీనివాసులురెడ్డి కొంతకాలం బాధితురాలితో ఒకే ఇంట్లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఆమెను దూరం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు కూడా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీఐ శ్రీనివాసులురెడ్డిని ఉన్నతాధికారి సజ్జనార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేప్ కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





