పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా, మే 5: పామర్రులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. భర్త, అతడి సోదరులను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. నందివాడకు చెందిన మురళీకృష్ణకు 13 ఏళ్ల క్రితం లక్ష్మీ ప్రసన్నతో పెళ్లయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా లక్ష్మీ ప్రసన్న 6 నెలల నుంచి దూరంగా ఉంటోంది. పామర్రులో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆదివారం భర్త మురళీ కృష్ణ, అతడి సోదరులు ఆమె దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవ చిలికి, చిలికి గాలి వానలా మారింది. లక్ష్మీ ప్రసన్నపై భర్త, అతడి సోదరులు ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిందని ధ్రువీకరించుకున్నాక నిందితులు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించింది.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





