Lakshmi Devi Blessings: నవంబర్ 1 నుంచి సింహ రాశిలో గురువు తన సంచారాన్ని ప్రారంభించడం, 12, 13 తేదీల్లో శని, బుధ, శుక్రులు వక్ర త్యాగం చేయడం, కుజుడు రాశి మారడం వంటి కారణాల వల్ల ఈ నెలలో కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉంది. ఈ రాశులవారు అక్టోబర్ 31 తర్వాత శివార్చన చేయించడం గానీ, శనికి దీపం వెలిగించడం గానీ చేయడం వల్ల వీరు తప్పకుండా ఈ మార్పుల వల్ల లబ్ధి పొందడానికి, శుభ ఫలితాలు పొందడానికి, సుఖ సంతోషాలతో, సంతృప్తిక రంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశులవారు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది.
మేషం: రాశ్యధిపతి కుజుడు తనకు మిత్ర క్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి వచ్చే నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరి కలు, ఆశలు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పద వులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల నవంబర్ నుంచి ఈ రాశివారికి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసు కుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగు తాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటకం: ధన స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే సూచనలున్నాయి. ఈ రాశివారికి షేర్లు తదితర ఆర్థిక లావాదేవీలు అదృష్టాన్ని పండిస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శుక్ర, గురువుల అనుకూలత వల్ల వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
సింహం: ఈ రాశిలోకి గురు, కుజులు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. వేగంగా ఆదాయ వృద్ధి చోటు చేసుకుంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావడం, సొంత ఇల్లు అమరడం వంటివి జరుగుతాయి. ఉద్యో గంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది.
వృశ్చికం: దశమ స్థానంలో గురు, కుజులు ప్రవేశిస్తున్నందువల్ల, ధన స్థానాన్ని గురువు వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి నవంబర్ నెలంతా అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలే కాక అదనపు రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
ధనుస్సు: రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలో ప్రవేశించడం, శుక్ర, బుధులు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మరింత పైకి ఎదగడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందు తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అదనపు ఆదాయ మార్గాలన్నీ సత్ఫలి తాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
Also read
- నవంబర్ నెలలో ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
- Diwali: దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
- వాటర్ హీటర్ తగిలి వివాహిత మృతి… విషాద ఘటన!
- అప్పుల బాధ తట్టుకోలేక.. కూతురికి లొకేషన్ షేర్ చేసి.!
- Mahanandi Temple: ఏపీలోని మహానంది ఆలయం దగ్గర అపచారం.. మాంసాహరం వండుకుని తిన్న యాత్రికులు.. వీడియో..
- Eagle Force: హైదరాబాద్ లొ ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Fake Bomb Threat Case:800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నెలో చిక్కిన నిందితుడు!
- అయ్యో బిడ్డా.. ఇంత దానికే అంత పెద్ద నిర్ణయమా..! తల్లిదండ్రులకు కడుపు కోత..!
- Andhra Pradesh: నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..వీడియో
- ‘వివాహం’ ఆలస్యమవుతోందా? – శిల రూపంలో ఉన్న ఈ ‘నరసింహస్వామి’ని దర్శిస్తే చాలు!









