నెల్లూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన జమిల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి వివాదంలో జోక్యం చేసుకుని సంగం సీఐ వేమారెడ్డి తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. తన చావుకు కారణం సీఐ అని తెలిపింది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన బలవన్మరణానికి గల కారణాలను ఆమె సెల్ఫీ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సీఐ వేధింపులు భరించలేక
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని -ఆదురుపల్లికి చెందిన జమీల అనే మహిళకు మక్బూల్ జాన్ అనే వ్యక్తికి మధ్య కొంతకాలంగా ఇంటి వివాదం కొనసాగుతుంది. ఈ విషయంపై ఎమ్మార్వో, ఎస్ఐ విచారణ చేపట్టి.. ఇల్లు ఆమెకే చెందుతుందని తేల్చి చెప్పారు. కానీ ఈ స్థల వివాదంలో సీఐ వేమారెడ్డి జోక్యం చేసుకున్నారని ఆమె తెలిపింది
సీఐ వేమారెడ్డి వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఆ మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. తన చావుకు సీఐ కారణమంటూ జమీల పురుగులు మందు తాగి సెల్ఫీ వీడియో తీసింది. సీఐ తనను 8 నెలలుగా ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది.
ఈ విషయంపై పోలీసులకు చాలా సార్లు చెప్పానని.. కానీ వారెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పురుగుల మందు తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. స్థానికులు గుర్తించి ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె రిలీజ్ చేసిన ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్‌గా మారింది.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు