విజయవాడలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 18 నెలల పసిపాపను ఓ కిరాతకుడు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఓ మహిళకు, విజయవాడకు చెందిన వంశీ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రియుడితో గొడవ జరుగుతుండగా, కోపంతో ఊగిపోయిన వంశీ సదరు మహిళపై దాడి చేశాడు. అంతేకాదు ఆమె ఒడిలోని 18 నెలల కుమార్తెను అత్యంత క్రూరంగా గోడకేసి కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జరిగిన ఘోరాన్ని ఐదేళ్ల కుమారుడి ద్వారా తెలుసుకున్న తండ్రి, గన్నవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును విజయవాడకు బదిలీ చేశారు. ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





