తాండూరులో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు ప్రేమను చెడగొట్టాలని ఒక తల్లి మంత్రగాడితో కలిసి క్షుద్ర పూజలు చేయించింది. కాలనీవాసులు మంత్రగాడిని పట్టుకుని దేహాశుద్ధి చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అంటారు. కానీ, అదే ప్రేమ ఒక కన్నతల్లిని కసాయిగా మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురు మనసు మార్చుకోవాలని, ఆమె ప్రేమ పేటాకులు కావాలని ఓ తల్లి ఏకంగా క్షుద్రపూజల దారి పట్టడం వికారాబాద్ జిల్లా తాండూరులో తీవ్ర కలకలం రేపింది. నమ్మలేని నిజం ఏమిటంటే, తన బిడ్డ బాగుండాలని కోరుకోవాల్సిన తల్లే, మంత్రగాడితో కలిసి సొంత కూతురిపైనే చేతబడి చేయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఇందిరా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే కూతురు ప్రేమ పేటాకులు కావాలని తల్లి సాయమ్మ తాండూరు పట్టణానికి చెందిన మంత్రగాడిని సంప్రదించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తెల్లవారుజామున పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో అమ్మాయిని కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేస్తుండగా చూసిన కాలనీవాసులు ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. విషయాన్ని అర్థం చేసుకుని కాలనీవాసులు కొందరు మంత్రగాడికి దేహాశుద్ధి చేశారు. ఈ విషయం కాలనీవాసుల జోక్యంతో తాండూరు పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరింది. తీవ్ర కలకలం రేగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశం మారింది.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





