కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది. చైత్ర అనే మహిళకు గజేంద్రతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది, ఆ దంపతులకు ఎనిమిది, పది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైత్ర గతంలో పునీత్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే పెద్దల జోక్యంతో ఆ సంబంధం విడిపోయింది. అయితే గత ఏడాది కాలంగా, ఆమె శివ అనే మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ప్రారంభించింది.
అడ్డుకుంటారనే భయంతో
తన వివాహేతర సంబంధాన్ని అడ్డుకుంటారనే భయంతో, చైత్ర వారిని అంతమొందించడానికి కుట్ర పన్నింది. ఆమె భర్త, పిల్లలు, ఆమె అత్తమామలు తినే ఆహారంకాఫీలో విషపూరిత మాత్రలను కలిపింది. భోజనం తర్వాత వారికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు మొదట్లో ఫుడ్ పాయిజనింగ్‌ను అనుమానించారు. అనుమానించిన ఆమె భర్త గజేంద్ర బేలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైత్ర ఉద్దేశపూర్వకంగా ఆహారంలో విషంతో కలిపిందని నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు, ఆమె లవర్ శివ పరారీలో ఉన్నాడు. శివుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు
Also read
- నేటి జాతకములు….12 నవంబర్, 2025
- Nandi in Shiva temple: శివాలయాల్లో
నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి? - శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
- Pune Crime: ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు
- Annamaya District:దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన





