ఓ మహిళకు తన కూతురు అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించేసరికి ఉలిక్కిపడింది. పెళ్లి చేసి పంపిన కూతురు ఫోటోలు ఇలా బయటపడడంతో ఆమె కాపురం ఏమవుతుందోనని కంగారు పడింది. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేసరికి.. అసలు విషయం బయటపడింది.. దీంతో ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు..
కూతురితో ఇన్‌స్టాలో పరిచయం.. తల్లికి
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు.. చాలా సందర్భాల్లో మహిళలు, యువతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాలక్షేపం కోసం మొదలైన స్నేహం కాస్త.. హద్దులు దాటి మితిమీరుతోంది. అవతలివాడి మాయమాటలకు మైమచిపోయి.. ప్రమాదంలో పడుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా.. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఓ మహిళకు తన కూతురు అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించేసరికి ఉలిక్కిపడింది. పెళ్లి చేసి పంపిన కూతురు ఫోటోలు ఇలా బయటపడడంతో ఆమె కాపురం ఏమవుతుందోనని కంగారు పడింది. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేసరికి.. అసలు విషయం బయటపడింది.. దీంతో ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు.. ఇంతకీ ఆ నిందితుడు ఎవడంటే..? గతంలో కూతురుతో పరిచయం ఉన్న యువకుడేనని.. పోలీసులు నిగ్గుతెల్చారు.. కూతురు ఫొటోలతో తల్లికి ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు.. అసలు వ్యవహారం ఏంటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
వివరాల్లోకి వెళితే..
విశాఖ నగరంకు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని ఒక వాట్సాప్ నెంబర్ నుంచి కొన్ని ఫోటోలు వచ్చాయి. దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్..! అవి ఎవరివో ఫోటోలు కాదు.. తన కూతురే.. అవి కూడా అశ్లీలంగా ఉన్నాయి. ఈ లోగానే మరో మెసేజ్.. ఆ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు. దీంతో ఆ తల్లికి చెమటలు పట్టాయి. ఎందుకంటే కూతురు అత్తింట్లో ఉంటుంది. ఇటీవల వివాహం చేసి పంపించింది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తీవ్ర ఆందోళన గురైన బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అలా ట్రాక్ చేశారు..
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు.. బాధితురాలి కూతురు ఇన్‌స్టా అకౌంటు వెరిఫై చేశారు. కూపి లాగితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు తనకి ఒక తెలియని ఇంస్టాగ్రామ్ ఎకౌంటు నుంచి రిక్వెస్ట్ వచ్చి.. ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాటలతో మభ్య పెట్టి వీడియో కాల్ చేయించుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోలు సేవ్ చేసుకున్నాడు. ఆ తరువత బాధితురాలికి పెళ్లైన విషయం తెలుసుకొని.. వాళ్ళ తల్లికి బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లి నెంబర్ కి డబ్బులు కోసం అ ఫొటోస్ పంపించి బెదిరించాడు. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. కర్నూలుకు చెందిన నిందితుడని ట్రాక్ చేశారు. చివరకు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
పోలీసుల సూచన ఇదే..
ఎవరికైన అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ నందు రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని, అలానే మన సోషల్ మీడియా ఎకౌంటులను ప్రైవేటులో పెట్టుకోవాలని, అవతలి వారి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం పనికి రాదని, తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కోసం సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్: 7995095799వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని.. వెంటనే చర్యలు తీసుకుంటామని సూచించారు
Also read
- నేటి జాతకములు..16 జూలై, 2025
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!