మన ఇరు తెలుగు రాష్ట్రాలలో వంటలు చేసేవాళ్లు అన్ని కులాల్లో ఉన్నారు, పౌరోహిత్యం చేసేవాళ్లు అన్ని కులాల్లో ఉన్నారు. దీన్ని బ్రాహ్మణ జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి.
తమది కులవృత్తిగా ప్రకటించమని ప్రభుత్వాల్ని అడుక్కునే అంతగా దిగజారిపోయి ప్రవర్తించాల్సిన పనిలేదు, సమాజంలో మిగిలిన ఏ కులాలు కూడా ఇంతలాగా దిగజారలేదు. తిప్పితిప్పి కొడితే రెండు రాష్ట్రాల్లో కేవలం 3% {మూడు శాతం} మాత్రమే ఉంది ఈ బ్రాహ్మణ జాతి.,
*ఇక కులవృత్తి గురించి మాట్లాడుకుందాం….*
బ్రాహ్మణులలో కొంతమంది పాపం పూట గడవడం కోసం, కుటుంబాన్ని బ్రతికించడం కోసం సమాజంలో రోడ్లమీద చెప్పులు కుడుతున్నారు, చెప్పులు షాపులు మెయింటైన్ చేస్తున్నారు, బ్రాహ్మణులు శానిటేషన్ వర్క్లు చేస్తున్నారు, ప్రభుత్వాల కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నారు, బ్రాహ్మణులు గుమస్తా పని చేస్తున్నారు, బ్రాహ్మణులు చెక్క పని చేస్తున్నారు, బ్రాహ్మణులు మెకానిక్ పని చేస్తున్నారు, బ్రాహ్మణులు డ్రైవర్ వృత్తి చేస్తున్నారు, బ్రాహ్మణులు బంగారపు పని చేస్తున్నారు, బ్రాహ్మణులు నిత్యవసర వస్తువులు అమ్ముతున్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బ్రాహ్మణులు క్షౌర వృత్తి కూడా చేస్తున్నారు. బ్రాహ్మణులు మద్యం వ్యాపారం కూడా చేస్తున్నారు, మద్యం వ్యాపారంలో పార్టనర్లుగా చేరి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు, బ్రాహ్మణులు సినీ ఇండస్ట్రీలో వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు, బ్రాహ్మణులు చిన్న పెద్ద పరిశ్రమలు నెలకొల్పిన వారు ఉన్నారు, వాటిలో కూలీలుగా చేసేవారు, బ్రాహ్మణులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, రియల్ బ్రోకర్ లో ఉన్నారు, భవన నిర్మాణ రంగంలో బిల్డర్లు గా మారిన వారు ఉన్నారు, వాటిలోనే తాపీ పనులు చేసేవారు ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కొంతమంది బ్రాహ్మణులు బిక్షగాళ్లుగా మారి బిక్షం ఎత్తుకునే వారి సంఘటనలు మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, బ్రాహ్మణులు వడ్డీ వ్యాపారం కూడా చేసే వారు ఉన్నారు. వడ్డీలకు తీసుకునేవారు ఉన్నారు. ప్రభుత్వ రంగాల్లో అధికారులుగా ఉన్నారు అటెండరులు, స్వీపర్లు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు జర్నలిస్టులుగా ఉన్నారు. చిన్న చిన్న పత్రిక, చానల్స్ అధినేతలుగా కూడా ఉన్నారు, బ్రాహ్మణుల్లో కులాన్ని అమ్ముకునే బ్లాక్ మెయిలర్సు ఉన్నారు, బ్రాహ్మణ జాతికి ఏదో చెయ్యాలి అనే తపనతో రోడ్ల మీదకు వచ్చి పోరాడే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు బోజన మెస్సులు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, రోడ్లమీద టిఫిన్ బండ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, హోటల్లో బల్లలు తుడిచే స్వీపర్లుగా కూడా ఉన్నారు. వివిధ వృత్తుల్లో రోజువారి కూలీ పనులు చేసుకునే వారు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు చీటింగ్ చేసిన సంఘటనలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కోకోల్లలు ఉన్నాయి, బ్రాహ్మణ చీటర్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. చివరికి రౌడీ వృత్తిలో చేరి రౌడీషీటర్లుగా మారినవారు ఉన్నారు, సెటిల్మెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో కొందరు మాత్రమే తాగుబోతులుగా, జూదగాళ్ళుగా, వ్యభిచారులుగా, చీటర్లగా, రాజకీయ నాయకులకు బానిసలుగా మారిన వారు ఉన్నారు. గ్రామ సర్పంచ్ దగ్గర నుండి ఎంపీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు అయిన వారు కూడా ఉన్నారు.
*విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, చాత్తద్ద శ్రీవైష్ణవులు, మాదిగ ఆది జాంబవంతులు, లింగాయత్ లు,కమ్మ,కాపు,రెడ్డి,దళిత,sc,st పురోహితులు ప్రస్తుత సమాజంలో శుభ,అశుభ కార్యక్రమాలు చేయిస్తున్నారు, వారు బ్రాహ్మణులకు కూడా కార్యక్రమాలు అప్పజెప్తున్నారు. అది మీరు మీ అహంకార మూర్ఖత్వంతో ఇంకా తెలుసుకోలేదా లేదా మీ రాజకీయ బ్రతుకుల కోసం, మీకు పేరు కోసం కులాన్ని అడ్డుపెట్టుకొని ఈ ప్రాకులాటనా…???*
*బ్రాహ్మణులు శూద్రులు చేసే పనులన్నీ ప్రస్తుత సమాజంలో చేస్తున్నప్పుడు ఇంకెక్కడి కుల వృత్తి రా అయ్యా 😜🤣. పెద్ద NTR సినిమా డైలాగ్ చెప్పినట్లు కులమూ కులమూ ఎప్పుడో, ఏనాడో మంట కలిసిపోయింది రా అయ్యా, ఏ కులాలు వారు వారి యొక్క వృత్తుల్ని కులవృత్తులుగా ప్రకటించమని ప్రభుత్వాలని అడుక్కున్న దాఖలాలు లేనప్పుడు ఎందుకురా అయ్యా మీకు ఈ గోల. ఏ ప్రభుత్వాలు కూడా కులవృత్తులను ప్రకటించవురా అయ్యా రాజ్యాంగం అదీకరణల, చట్ట ప్రకారం న్యాయ ప్రకారం కూడా ప్రకటించే పరిస్థితి ఈ భారత దేశ రాజ్యాంగంలో లేదు. కనీసం భారత రాజ్యాంగం అన్నా చదువుకోండిరా అయ్యా… రాజ్యాంగంలో అధికరణలు మార్చమని దేశవ్యాప్తంగా కనీసం మీరు బయటకు వచ్చి పోరాటం చేయండి రా అయ్యా… ఉభయ పార్లమెంటులో రాజ్యాంగం మార్చినప్పుడు ఏమన్న మీరు అడిగే కులవృత్తిని ప్రకటిస్తాయేమో ప్రభుత్వాలు. కులవృత్తి అంటే లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది ప్రభుత్వాల ఆధ్వర్యంలో. బ్రాహ్మణ పురోహితుల్ని గౌరవంగా వారి వారి ప్రాంతాల్లో బతికేవారిని ఇకనుండి ప్రభుత్వాలు బ్రాహ్మణ పురోహిత లేబర్ (కార్మిక) గా ప్రకటించమనేగా మీ కోరిక. ఆ లేబరుకు కార్మిక శాఖ దినసరి కూలీని ప్రకటిస్తుంది, దాన్ని అమలు చేయాలి, ఆచరించాలి. అది మీకు ఇష్టమేనా దౌర్భాగ్యపు & అప్రాచ్యపు శుంఠల్లారా…🫣*
*నవ నాగరిక సమాజంలో ఏనాడో చైతన్యం వచ్చి మార్పు చెందినప్పుడు ఈ పిచ్చి పిచ్చి కోరికలు సమాజం మీద, ప్రభుత్వాలు మీద రుద్దటం, ఇంకా ఈ సమాజంలో బ్రాహ్మణ జాతిని బలి చేయటం, బ్రాహ్మణ జాతికి ఈ దౌర్భాగ్యం ఎందుకురా…?? కులం మీద మీ రాజకీయాలు ఏందిరా, దమ్ముంటే రాజకీయ పార్టీల్లో చేరి అక్కడ రాజకీయాలు చేయండి రా దమ్ముంటే, రాష్ట్ర సంఘాల పేరుతో భోజనాలు మీటింగులు పెట్టుకొని, చందాలు వసూలు చేసుకుంటూ, రాజకీయ పార్టీలకు తొత్తుగా మారిన మీరు, పార్టీల్లో మీ పదవుల ప్రాపకం కోసం ఎందుకురా ఇంకా ఈ బ్రాహ్మణ జాతిని సమాజంలో సమూలంగా నాశనం చేస్తారు బడుద్దాయిలూ… ఏందిరా మీ వల్ల జరిగింది బ్రాహ్మణ జాతికి ఉపయోగం, మీ రెండు మూడేళ్ల పదవుల రాజకీయ పదవుల కోసం బ్రాహ్మణ జాతిని ప్రభుత్వాల దగ్గర, రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెట్టకండి రా, మీరు నిజంగా బ్రాహ్మణ జాతిలో జన్మించి ఉంటే ముందు పేద బ్రాహ్మణుని ఆర్థికంగా మీ మీ ప్రాంతాల్లో పైకి తీసుకురండి, ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉండండి, బ్రాహ్మణుడు చస్తే పదిమంది నుంచోండి రా వెళ్ళి స్వార్థపు వెధవల్లారా… కనీసం బ్రాహ్మణ జాతిలో జన్మించినందుకు, భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినందుకు ఆత్మాభిమానంతోనైనా బతకండి రా అయ్యా.. జాతికి, సమాజానికి కనీసం సేవ చేసి చచ్చిపోండి, భవిష్యత్ తరాలైన కనీసం మీ పేరు గుర్తు పెట్టుకుంటాయి, ఇదే యదార్థం వాస్తవం భవిష్యత్తు…🙏🙏…🫣*
ధర్మాన్ని నువ్వు రక్షిస్తే… ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది… భగవాన్ ఉవాచ🙏
