SGSTV NEWS
CrimeTelangana

Suicide Crime News: అవమానించిన స్నేహితురాళ్లు..బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..


స్నేహితురాళ్లు అవమానించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న నిత్య చదువులో వెనుబడడంతో ఆమె స్నేహితురాళ్లు సంజన, వైష్ణవి అవమానించినట్లు మాట్లాడారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.


స్నేహితులు అవమానించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య బీటెక్‌ చదువుతోంది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రైవేటు హస్టల్‌లో ఉంటూ అక్కడి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిత్య చదువులో వెనుబడింది. ఈ విషయంలోనే ఆమె స్నేహితురాళ్లు సంజన, వైష్ణవి అవమానించినట్లు మాట్లాడారు. దీంతో మనస్థాపానికి గురైన నిత్య ఇంటికి వచ్చేసింది

వచ్చినప్పటినుంచి దిగులుగా ఉంటున్న నిత్య ఈ నెల 2న  గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంచారు. కాగా చికిత్స పొందుతూ నిత్య మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు జరుపుతున్నారు.  కాగా మృతురాలికి తల్లిదండ్రులు తిరుపతి, సునీత, సోదరుడు ఉన్నారు. ఉన్న కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also read

Related posts

Share this