విద్యార్థుల ఫోన్లను చోరీ చేసి మహిళలకు అసభ్యకర చిత్రాలను పంపాడు ఓ కార్పొరేట్ విద్యాసంస్థలోని సూపర్వైజర్. ఓ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి…
నిందితుడి అరెస్టు.. విద్యాసంస్థకు నోటీసులు
విజయవాడ, ఏప్రిల్: విద్యార్థుల ఫోన్లను చోరీ చేసి మహిళలకు అసభ్యకర చిత్రాలను పంపాడు ఓ కార్పొరేట్ విద్యాసంస్థలోని సూపర్వైజర్. ఓ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, ఆ విద్యాసంస్థకు నోటీసు జారీ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులో ఓ కార్పొరేట్ విద్యాసంస్థ పాఠశాల, జూనియర్ కళాశాల నిర్వహిస్తోంది. కళాశాల హాస్టల్లో ఉండే కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి రహస్యంగా సెల్ఫోన్లను సమకూర్చుకున్నారు. నిబంధనల ప్రకారం హాస్టల్లో ఉండే విద్యార్థులకు సెల్ఫోన్లు నిషేధం. ప్రాంగణంలోని కాయిన్ బాక్స్ నుంచే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి. ఇక్కడ క్లీనింగ్ పనులను పర్యవేక్షించే సూపర్వైజర్ మల్లెల రామారావు ఆ హాస్టల్ విద్యార్థుల సెల్ఫోన్లను దొంగిలించాడు. విద్యార్థులు తరగతులకు వెళ్లాక వారి గదులను శుభ్రం చేయించేవాడు. ఆ సమయంలో విద్యార్థుల ర్యాక్‌లు, పడకల కింద తనిఖీ చేసి సెల్ఫోన్లను కాజేశాడు. వరుసగా ఫోన్లు మాయమవుతున్నా ప్రిన్సిపాల్‌కు దొరికిపోతామన్న భయంతో విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





