జీడిమెట్ల: జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి రావడంతో బాలుడు తండ్రి ఖంగుతిన్నాడు. సదరు టీచర్.. బాలుడి వద్ద నుంచి దాదాపు రెండు లక్షలు తీసుకున్నట్టు తండ్రి గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పట్టించుకోకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలో కమల్ నివాసం ఉంటున్నారు. కమల్ కుమారుడు.. స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ టీచర్ వద్దకు ట్యూషన్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ వస్తున్న బాలుడిని సదరు టీచర్ డబ్బులు అడగంతో అతడు తన ఇంట్లో మనీ దొంగతనం చేసి టీచర్కు ఇస్తున్నాడు. ఇలా పలుమార్లు డబ్బులు దొంగలించి.. రెండు లక్షలకుపైగా టీచర్కు ఇచ్చాడు. ఇక, ఇటీవలే.. ఐఫోన్ కూడా టీచర్కు ఇచ్చాడు.
తనకు ఫోన్ వద్దని.. డబ్బులే కావాలని సదరు టీచర్ అడగటంతో సదరు బాలుడు ఫోన్ అమ్మకానికి పెట్టాడు. అనంతరం, ఆ డబ్బులను మళ్లీ టీచర్ కు అందజేశాడు. ఈ నేపథ్యంలో మొబైల్ షాప్ ఓనర్.. బాలుడి తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు విషయంలో కమల్కు తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, వెంటనే కమల్.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు. అయితే, అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో కమల్.. తాజాగా
హెచ్ ఆర్ సి ని ఆశ్రయించారు. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత