సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్ కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు.
తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది.
కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు.
Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





