తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్‌కు చెందిన జర్నలిస్ట్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని సీనియర్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం హౌసింగ్
బోర్డ్ కు చెందిన జర్నలిస్ట్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని సీనియర్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ (36) తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకొని పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సై బాదం శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మృతుని సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేస్తామని తాడేపల్లిగూడెం పోలీసులు చెప్పారు. జర్నలిస్ట్ వర్ధన్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ దళిత సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో అనుమానితులు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తమ్మిశెట్టి రంగ సురేష్, శివ పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితులు తమ్మిశెట్టి రంగసురేష్, శివ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులపై పలు సెక్షన్ ల కింద తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





