Teacher Suspended : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని పినపాడు గిరిజన పాఠశాలలో PTM ప్రోగ్రాంకు ఫుల్లుగా ఓ టీచర్ రమణ తాగి వచ్చాడు. అంతే కాకుండా మత్తులో ఉండి బెంచీపైనే పడిపోయాడు దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మద్యం మత్తులో..
టీచర్ ప్రవర్తన పట్ల పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు ఇలా ఉంటే విద్యార్థుల చదువు పరిస్థితి ఏంటని కొంత మంది ఫైర్ అయ్యారు. తాగి పాఠశాలకు వచ్చిన టీచర్పై ప్రభుత్వ వేటు వేసింది. మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్కు మద్యం మత్తులో హాజరైన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బెంచ్ పై పడిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఎంక్వెరీ నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు కొరబు వెంకట రమణను ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేసారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





