హైదరాబాద్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్నాడు ఓ కామాంధుడు. పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో అతనిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలకు పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో వారిని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతను మూడు నెలలుగా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఓ స్నేహితుడి ఇన్స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా అతని ఆచూకీ గుర్తించి బంజారాహిల్స్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో యువతిని వివాహం చేసుకున్న తర్వాత కూడా మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడికి గతంలో చోరీలు, స్నాచింగ్ కేసుల్లోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రొఫైల్‌లతో యువతులను లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా చర్చనీయాంశమైన ‘రిచ్ కిడ్’ తరహా మోసాల కేసుల మాదిరిగా నిందితుడి వ్యవహార శైలిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అరెస్టు చేసిన పవన్‌ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





