రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన మోనా బుగాలియా అనే యువతి, ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత, మూలి దేవి అనే పేరుతో నకిలీ పత్రాలతో రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్‌ఐగా పనిచేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో చేరిన ఆమె, యూనిఫామ్‌లో కనిపిస్తూ, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది.
ఓ అమ్మాయి పోలీస్ అవ్వాలని అనుకుంది. అందుకోసం ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ టెస్ట్ రాసింది. కానీ, ఫెయిల్ అయింది. కట్ చేస్తే.. ఏకంగా పోలీస్ అకాడమీలో రెండేళ్లుగా ఎస్‌ఐగా చెలామణి అవుతోంది. అది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. మోనా బుగాలియా అలియాస్ మూలి దేవి.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని నింబా కే బాస్ అనే గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్. పోలీస్ అవ్వాలనుకున్న మోనా రాజస్థాన్ సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రాసింది. కానీ, ఉత్తీర్ణత సాధించలేదు. 2021లో అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత, ఆమె మూలి దేవి అని పేరు మార్చుకొని పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించి, తాను సబ్-ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
ఆ తర్వాత ఆమె సబ్-ఇన్‌స్పెక్టర్ నియామకాల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన వాట్సాప్ గ్రూప్‌లో చేరి, స్పోర్ట్స్ కోటా ద్వారా చేరిన మునుపటి బ్యాచ్‌కు చెందిన అభ్యర్థిగా నటిస్తూ రాజస్థాన్ పోలీస్ అకాడమీలో తనను తాను పరిచయం చేసుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా మోనా పూర్తి యూనిఫాంలో RPA పరేడ్ గ్రౌండ్స్‌లో క్రమం తప్పకుండా కనిపించేది. బహిరంగ కసరత్తులలో పాల్గొంది, ర్యాంకింగ్ అధికారులతో ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో మంచి నీతులు చెబుతూ రీల్స్‌ను పోస్ట్ చేసింది. జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలో మిగతా వారికి లెక్చర్లు కూడా ఇచ్చేది. అది కూడా పోలీస్ యూనిఫామ్‌లోనే.
పోలీస్ అకాడమీలో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నప్పటికీ మోనా ఎలా అందులోకి ఎంటరైందో ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌లా ఫోజులు కొడుతూ.. అకాడమీలో తన రాజ్యం చెలాయించింది. కానీ, కొంతమంది ట్రైనీ సబ్-ఇన్‌స్పెక్టర్లు మోనా గుర్తింపుపై సందేహాలు వ్యక్తం చేయడంతో అసలు బండారం బయటపడింది. ఈమె ఓవర్ యాక్షన్ చూసి.. కొంతమంది ట్రైనీలు సీనియర్ అధికారులకు సమాచారం అందించారు. మోనాపై అంతర్గత విచారణ చేస్తే.. అసలు రికార్డ్స్‌లో ఆమె పేరు ఎక్కడా లేదు. తప్పుడు పత్రాలతో అకాడమీలో పోలీస్‌గా చెలామణి అవుతూ.. బయట వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఒక దొంగ పోలీస్ కథ ముగిసింది
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025