*రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ గుంటూరులో అరండల్ పేట 4/4 శివాలయంలో ప్రత్యేక పూజలు…*
అమరావతి:
గుంటూరు అరండల్ పేటలో ఉన్న శ్రీ హంపి పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వర శివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శివ దీక్షలో ఉన్న వాసంశెట్టి సుభాష్ బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాకను పురస్కరించుకొని దేవాలయంలో పూర్ణకుంభ స్వాగతంతో దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రివర్యులకు దుస్సాలువ, పూలమాలలు వేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏకా ప్రసాదు, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యం, కుందుర్తి శ్రీనివాస్, భాస్కర్ శర్మ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, స్థానిక డివిజన్ అధ్యక్షులు మర్రిపాటి శ్రీనివాస్, శబరి, చైతన్య,బాజీ,రమేష్ తదితరులు పాల్గొన్నారు
Also read
- సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కొనసాగుతున్న విచారణ.. ఇదిగో లేటెస్ట్ అప్డేట్!
- మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
- పాపం ఏం కష్టమొచ్చిందో..! అందరూ చూస్తుండగానే గోదావరి నదిలోకి దూకిన మహిళ!
- భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణ పరిహారం ప్రకటించాలి ….గ్రీష్మ కుమార్,
- అబార్షన్ చేయించుకోమన్నారు.. చివరకు రోడ్డుపై పడేశారు! అత్తింటి ముందు గర్భిణీ దీక్ష!





