మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా, మార్చి 19 మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం ఇన్చార్జి డీఎస్పీ కె. ధర్మేంద్ర, ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు (41) ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది.
ఆ అమ్మాయిని ప్రలోభపెట్టి రఘు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక నీరసంగా ఉండటం అనారోగ్యానికి గురవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై మచిలీపట్నం ఆర్‌పేట పోలీసులకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





