ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ జోగారావు తెలిపారు.
కొత్తవలస, ఆగస్టు 4: ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ జోగారావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అప్పికొండ హర్షిణి అనే 22 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని విశాఖపట్నంలోని వెల్ఫేర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజూ తుమ్మికాపల్లి నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటుంది. ఎప్పటిలాగే సోమవారం కూడా కళాశాలకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబీకులు తమ బంధవులను, స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో విద్యార్థిని తల్లి కాంతమణి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- ఏం మనిషివిరా.. మగబిడ్డ పుట్టలేదని భార్యకు నరకం చూపించాడు.. చివరకు..
- Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్మాస్టర్… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..
- వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ.. అయినా ఎలా చిక్కాడంటే..?
- East Godavari Election Results: తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఘోర పరాభవం.. కూటమి క్లీన్ స్వీప్
- తెలంగాణ ఉద్యమకారుడి విషాద మరణం





