విజయనగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కేఎల్ పురంలో గల రెవెన్యూ కాలనీలో మంగళవారం సాయం త్రం వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
విజయనగరం, ఆగస్టు : విజయనగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కేఎల్ పురంలో గల రెవెన్యూ కాలనీలో మంగళవారం సాయం త్రం వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రెవెన్యూ కాలనీలో మేడపల్లి లావణ్య(31) అనే మహిళ తన ఇద్దరు కుమారులతో నివాసం ఉంటోంది. తన భర్త కిశోర్ దుబాయిలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. మంగళ వారం ఆ ఇద్దరు కుమారులు పాఠశాలకు వెళ్లారు. ఆ తర్వాత లావణ్య సమీపం లో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం మూడు గం టలకు ఇంటికి చేరింది. అయితే కుమారులు పాఠశాల నుంచి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు తల్లి ఉరివేసుకుని ఉంది. వారు భయబ్రాంతులకు గురై.. వెంటనే అమ్మమ్మ రమణికి ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. వెంటనే రమణి, భర్త రమేష్ కుమార్ పట్నాయక్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ రామలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి రమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామలక్ష్మి తెలిపారు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





