ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారిన విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండెడ్ సీఐ నాగరాజు సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. లాకప్‌డెత్ తర్వాత ఏం జరిగిందనే విషయాలు రాబట్టేందుకు ట్రై చేస్తున్నారు.
విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు సహ ఐదుగురిని అరెస్ట్ చేసిన సిట్ సాయి కృష్ణ లాకప్ డెత్ తరువాత ఏమి జరిగిందనే దానిపై సమాధానం రాబట్టేందుకు ట్రై చేస్తున్నారు. కానీ మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో ఏమి జరిగిందనే విషయంపై మాత్రం నిందితులు నోరు మెదపట్లేదని అధికారులు తెలిపారు. ఇదే అంశాన్ని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు.
ఇక సిఐ నాగరాజు అరెస్టు తరువాత సహకారం అందించిన ముగ్గురు హెడ్ కానిస్టేబుల్లు,మరో కానిస్టేబుల్లను ఇప్పటికే అరెస్టు చేసిన సిట్ బృందం.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలీంపు చేపట్టింది. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్న సిఐ స్నేహితుడు సురేష్, కృష్ణ లంక స్టేషన్ కు చెందిన మరొక మహిళా కానిస్టేబుల్ రోల్ పై సిట్ ఫోకస్ పెట్టింది. అలాగే లాకప్ డెత్ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చనున్న సిట్ అధికారులు తెలిపారు. కృష్ణలంక స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజ్ మిస్ అవడంతో స్టేషన్ పరిసరాల పరిధిలో పబ్లిక్ సర్వేలెన్స్ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న తెలిపారు.
మరోవైపు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటి వరకు వీడని చిక్కుముడులు, లాకప్ డెత్ తరువాత తెరపైకి వచ్చిన సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సాయి ఎప్పుడూ చనిపోయాడు,ఎక్కడ చనిపోయాడు,చనిపోయాక ఏమయ్యాడు,ఎక్కడ దహనం చేసారు ఎక్కడికి తరలించారు.సాయి కృష్ణకు వైద్యం అందించింది ఎవ్వరు, చనిపోయాడని చెప్పింది ఎవ్వరు అనేది తేల్చలేకపోతున్నారు సిట్ అధికారులు
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





