SGSTV NEWS
Astrology

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు



వార ఫలాలు (జూన్ 15-21, 2025): మేష రాశి వారికి ఆదాయపరంగా వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పని భారం పెరగడానికి, కొత్త బాధ్యతలు, లక్ష్యాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, బుధ, శుక్ర, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయపరంగా వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పని భారం పెరగడానికి, కొత్త బాధ్యతలు, లక్ష్యాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంది. ఇందుకు సిద్దంగా ఉండడం మంచిది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది శ్రమతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు.  ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఈ రాశివారికి దుర్గాదేవి స్తోత్ర పఠనం చాలా మంచిది.


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మొత్తం మీద పని భారం ఎక్కువగా ఉంటుంది. ధన స్థానంలో గురు, బుధ, రవుల యుతి వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. గణపతిని ఎక్కువగా ధ్యానించడం వల్ల కొన్ని కష్టనష్టాలు తగ్గే అవకాశం ఉంది.



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశిలో గురు, బుధ, రవుల సంచారంతో పాటు లాభ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అనేక విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ వృద్ధి ప్రయత్నా లన్నీ నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. తరచూ శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం చాలా అవసరం.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడంతో పాటు, అష్టమంలో రాహు సంచారం వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటే అవకాశం ఉంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ  జీవితంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొద్దిగా పనిభారం, బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా అనుకున్నవి సాధిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. పెళ్లి సంబంధానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి రోజూ సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): శుభ గ్రహాలతో లాభ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగ్గా సాగిపోతాయి. అష్టమ శని కారణంగా ప్రతి పనిలోనూ శ్రమ, ఒత్తిడి ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థికంగా మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.  నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తరచూ శివార్చన మంచిది.


కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దశమ స్థానంలో గురు, బుధ, రవుల యుతి వల్ల ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వారమంతా సంతృప్తికరంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం మంచిది.


తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో గురు, రవి, బుధుల యుతి వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ రాబడి ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా ధన  నష్టం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్కంద స్తోత్రాన్ని పఠించడం మంచిది.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): దశమాధిపతి రవి తప్ప మిగిలిన గ్రహాలేవీ అనుకూలంగా లేనందువల్ల ఈ వారమంతా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఆదాయాన్ని మించి ఖర్చులుండే అవకాశం ఉంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు, మదుపులు, పెట్టు బడులకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తరచూ దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వల్ల లాభముంటుంది.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సప్తమ స్థానంలో గురు, బుధ, రవులు చేరడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఏ  పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. శివార్చన చేయించడం మంచిది.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే  అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగి పోతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ,  తిప్పట ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికా రులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదిత్య హృదయం చదువుకోవడం ఉత్తమం.


కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలో గురు, రవి, బుధుల యుతి కారణంగా, వారమంతా సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయం మీద శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా రాణిస్తారు. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. తరచూ లక్ష్మీనారాయణ స్తోత్ర పఠనం చాలా మంచిది.


మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఏలిన్నాటి శని కారణంగా కొద్దిపాటి వ్యయప్రయాసలు, స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. కొద్ది ప్రయత్నంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్నిముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కొద్దిగా తిప్పట తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అవనసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. తరచూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

Also read

Related posts

Share this