విశాఖలోని పెందుర్తిలో నకిలీ పోలీసులుగా చలామణి అవుతున్న ఇద్దరు అరెస్టు – నిందితులపై 15 కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడి
నకిలీ పోలీసులుగా నటిస్తూ ఓ ఇద్దరు వ్యక్తులు ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయి. ఈ ఘటన విశాఖలోని పెందుర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పెందుర్తి పరిసర ప్రాంతాల్లో నకిలీ పోలీసులుగా నటిస్తూ ప్రేమ జంటల నుంచి నగదు దోచుకుంటున్నారు. గత వారం రోజులుగా వీళ్లు తిరుగుతూ ఈ నెల 6వ తేదీన ఒక ప్రేమ జంటను పట్టుకుని బెదిరించి వారి వద్ద నుంచి రూ. 2 వేలు నగదును దోచుకున్నారు. ఇలానే మరో జంట వద్ద రూ.20 వేలు ఫోన్ పే ద్వారా తమ ఖాతాలో జమ చేసుకున్నారు.
బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులైన శివప్రసాద్, కందరపు గోపి పోలీస్ యూనిఫామ్ ధరించి స్కూటీపై తిరుగుతూ బీచ్‌లో ఉన్న ప్రేమ జంటలను పట్టుకుని మీపై కేసులు పెడతాం అంటూ బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకున్నారు. పెందుర్తి పోలీసులు వల పన్ని వీళ్లను పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేటప్పుడు వారు పోలీస్ యూనిఫామ్ ధరించి ఉండటం విశేషం. ఈ ఇద్దరు నిందితులు నేరచరిత్ర ఉన్న నిందితులే. వీరు సుమారు 15 కేసుల్లో నిందితులు.
శివప్రసాద్, కందరపు గోపిని అదుపులో తీసుకున్న పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ తరహాలో ఎవరైనా మోసానికి గురై ఉంటే భయపడకుండా పెందుర్తి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పెందుర్తి సీఐ సతీష్ కుమార్ తెలిపారు.
విజయనగారానికి చెందిన వ్యక్తి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దారి మధ్యలో అతన్ని ఆపి పోలీసులమని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నగదు పంపించుకున్నారు. ఇందులో మొదటి నిందితుడు శివప్రసాద్ అనే వ్యక్తి. ఇతను గతంలో ఏపీఎస్పీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో తొలగింపబడ్డాడు. ఇతను గతంలో ఇలాంటివే చేసి జేలుకి వెళ్లి వచ్చారు. ఇంకా ఇతనిపై పలు కేసులు ఉన్నాయి.-సతీష్ కుమార్, సీఐ
Also read
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో
- జులై 12.. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. అప్పులు రాసిన మరణ శాసనం.. అయ్యో పిల్లలు..