SGSTV NEWS online
Andhra PradeshCrimeNational

నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..



ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట మధ్య విభేదాలు తలెత్తాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఊర్మిళ.. తాడేపల్లికి చెందిన నాగరాజును వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులు అయ్యాయని తెలుసుకుంది. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆరోపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇంట్లో బంధించి, భోజనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని బాధితురాలు చెబుతోంది.

ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహం కొనసాగి ప్రేమగా మారింది. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అంగీకరించిన పెద్దలు తమ సమక్షంలోనే వివాహం జరిపించారు. ఆ తర్వాత.. కాపురం పెట్టిన కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయి. అన్నం పెట్టకుండా వేధిస్తుండటంతో భార్య స్థానికుల సాయంతో పోలీసులకు చెంతకు చేరింది. ఛత్తీస్‌గడ్ కు చెందిన ఊర్మిళతో తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్దీ కాలం తర్వాత ప్రేమించుకుంటున్నామంటూ పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఐదు లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఊర్మిళా తల్లిదండ్రులకు ఇచ్చారు. ఆ తర్వాత తాడేపల్లిలో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే నాగరాజుకు అంతకుముందే రెండు వివాహాలై విడాకులైనట్లు ఊర్మిళా గుర్తించింది. అప్పటి నుండి ఇరువురి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఊర్మిళా కూడా తన భర్తతో గొడవపడటాన్ని గుర్తించిన నాగరాజు బంధువులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. దీంతో వేరే కాపురం పెట్టాలంటూ ఉర్మిళ పట్టుబట్టింది. దీంతో కొద్దిరోజుల కిందట ఊర్మిళాను అద్దెకు ఇల్లు తీసుకొని అక్కడికి తీసుకెళ్లాడు. కొత్త ఇంటిలో ఊర్మిళా తో ఆమె తల్లి కూడా నివసిస్తుంది.

గత నాలుగైదు రోజుల నుండి ఊర్మిళాను ఆమె తల్లిని బయటకు రాకుండా నాగరాజు అడ్డుకుంటున్నాడు. మరొకవైపు అన్నం కూడా పెట్టకపోవడంతో ఆమెలో ఆందోళన మరింత పెరిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఊర్మిళా పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఉంటున్న నివాసం వద్దకు వచ్చి అమె బాధలు తెలుసుకొని పిఎస్ కు తీసుకెళ్లారు. నాగరాజును పోలీస్ స్టేషన్ కు రావాలంటూ చెప్పారు. భర్త పెడుతున్న బాధలు తట్టుకోలేక తమ రాష్ట్రం చత్తీస్‌ఘడ్ కు వెళ్లిపోతామని బాధితులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాగరాజుపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Also read

Related posts