గుంటూరు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి పర్వీన్ సుల్తానాబేగం మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కర్నూలుకు చెందిన దుగ్గిపోగు పెద్దన్న (57) ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. మంగళగిరి ఆత్మకూరు పంచాయతీ పరిధిలోని శ్రీరామనగర్ లో ఉంటున్నాడు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ తన భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తోంది. 2021 జులై 26న పెద్దన్న.. ఆ మహిళ కుమార్తె (8)కు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ అతడిపై నేరం రుజువు చేయడంతో పదేళ్ల జైలుశిక్ష, రూ. 7 వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని అందించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ ప్రాసిక్యూషన్ నిర్వహించగా.. దిశ పోలీసుస్టేషన్ అప్పటి డీఎస్పీ రామారావు కేసు దర్యాప్తు చేశారు.
Also read
- పోలీసుల ఎదుటే గొంతు కోసుకుని..
- ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం
- వివాహిత ఆత్మహత్య
- నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్చల్!
- నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..





