కరీంనగర్‌కి చెందిన సునీల్, జ్యోతికు గతేడాది వివాహం జరగ్గా ఇటీవల జ్యోతికు శ్రీమంతం నిర్వహించారు. పుట్టింట్లో ఉన్న జ్యోతిని తీసుకువస్తుండగా బైక్ మీద నుంచి కింద పడి మృతి చెందింది. భార్య మృతి చూడలేని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ఏడాది క్రితం పెళ్లి, భార్య గర్భిణి కావడంతో ఇటీవల శ్రీమంతం నిర్వహించడం, అంతా సంతోషంలో ఉండగా ఒక్కసారి చీకటి అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లాలో బిచ్కుందుకు చెందిన మంగలి సునీల్‌కు గతేడాది జ్యోతితో వివాహం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె గర్భిణి కావడంతో ఇటీవల సీమంతం నిర్వహించారు.
వాహనం నుంచి కింద పడి..
ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో ఉంచారు. అయితే తిరిగి ఆమెను మళ్లీ తీసుకురావడానికి సునీల్ వెళ్లాడు. బైక్‌పై జ్యోతిని తీసుకొస్తుండగా వాహనం వేగం కారణంగా ఇద్దరూ కింద జారి పడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. భార్య చావును తట్టుకోలేని సునీల్ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు
ఇదిలా ఉండగా ఇటీవల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయింది. ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లగా ప్రాణాలు బలిగొన్నారు సిబ్బంది. మహిళ మృతికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్ ఆసుపత్రిలో 23 ఏళ్ల గర్భిణీ స్త్రీ మరణించింది. టోంక్ జిల్లాకు చెందిన గర్బిణీ మే 12న హిమోగ్లోబిన్ లెవల్స్ చాలా తక్కువగా ఉందని, టీబీ, ఇతర ఆరోగ్య సమస్యలతో సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. ఆ
మె మే 21న మరణించింది. ఆమె బ్లడ్ గ్రూప్‌కు మ్యాచ్ కానీ రక్తం ఎక్కించారని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగానే ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు