కర్ణాటకలోని బెల్గాంలో ఒక మఠం అధిపతిని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదే పదే అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం(మే 24) సమాచారం ఇచ్చారు. బెల్గాం జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకాలోని మేకాలి గ్రామంలోని రామమందిర మఠానికి చెందిన నిందితుడు హఠ యోగి లోకేశ్వర్ స్వామి (30)ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని బెల్గాంలో ఒక మఠం అధిపతిని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదే పదే అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం(మే 24) సమాచారం ఇచ్చారు. బెల్గాం జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకాలోని మేకాలి గ్రామంలోని రామమందిర మఠానికి చెందిన నిందితుడు హఠ యోగి లోకేశ్వర్ స్వామి (30)ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితురాలు, కుటుంబసభ్యులతో కలిసి స్వామి వద్దకు వెళ్లింది. వైద్యంతో నయం చేస్తాడని నమ్మి వెళ్లింది. కొంతమంది బంధువులు సూచించిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మఠానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో మే 13న ఈ నేరం జరిగిందని ఆరోపించింది. గ్రామంలోని తన బంధువుల ఇంటి నుండి తన ఇంటికి వెళుతుండగా, నిందితుడు తనకు లిఫ్ట్ ఇచ్చాడని బాధితురాలు తెలిపింది. తాను డ్రాప్ చేస్తానంటూ కారు ఎక్కించుకుని బాలికను కిడ్నాప్ చేశాడు. మే 13 నుంచి మే 15 వరకు రాయచూర్, బాగల్‌కోట్‌లోని లాడ్జీలలో లోకేశ్వర స్వామి తనను తీసుకెళ్లి, పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
రాయచూర్ లాడ్జిలో ఉంచి రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాగల్కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. దారుణానికి ఒడిగట్టిన తర్వాత, అతను తనను మహాలింగ్పుర బస్ స్టాండ్ వద్ద వదిలి వెళ్లాడు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధితురాలు తన తండ్రికి చెప్పినప్పుడు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. దీని తరువాత, ఆమె తండ్రి సూచన మేరకు ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత విభాగాల కింద స్వామిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం(మే 22) నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..