మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి
హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరీణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది.
సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేర్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు.
Also Read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?





