మంట ఎక్కువ ఎందుకు పెట్టావు అని అడగడమే పాపంకృష్ణా జిల్లా కొండిపర్రులో దారుణ ఘటన
కొండిపర్రు(పామర్రు): పొయ్యిలో మంట ఎందుకు ఎక్కువగా
పెట్టావని తిట్టిన తండ్రిని మద్యం మత్తులో ఉన్న కుమారుడు హత్య చేశాడు. ఈ ఉన్మాదం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పామర్రు పోలీసుల కథనం మేరకు.. కొండిపర్రు గ్రామశివారు డీపీగూడెంలో చదువుల సురేష్(45)కుమారుడు చంద్ర మహేష్ నివసిస్తున్నారు. సురేష్ భార్య గతంలో మృతి చెందింది. 22 ఏళ్ల చంద్రమహేష్ పనీపాట చేయకుండా తాగి తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి చంద్ర మహేష్ పొయ్యి వెలిగించి నీరు కాస్తున్నాడు.
ఆ సమయంలో తండ్రి సురేష్ వేడి నీరు తోడుతూ ఎందుకు ఇంత పెద్ద మంట పెట్టావు అని తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రమహేష్ ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తి తీసి తండ్రి మెడతో పాటు ఇంకా రెండు చోట్ల నరికాడు. సురేష్ రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ సుభాకర్ తెలిపారు.
Also read
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





