హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసింది.
ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





