దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్ కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.
అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ ను మీడియా ” వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్ కుమార్ కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





