హైదరాబాద్: వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కంచన్ బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బాలాపూర్ రోషన్రెలా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్ (30) మయన్మార్‌కు చెందిన ఓ యువతిని (19)ని ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారిని సైతం సుఖపెట్టాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు.
ఈ క్రమంలో ఆమెను ఫయాజ్ స్నేహితులైన నూర్ కమల్(30), ముజీబ్(29), జియా ఉర్ రెహమాన్ ఆలియాస్ ఇబ్రహీం(30)లు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి సామూహికంగా అత్యాచారానికి పాల్ప డ్డారు. ఈ క్రమంలో ఇంటి యజమాని కరెంటు బిల్లు, అద్దె నిమిత్తం ఇంటికి రాగా ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు బాధితురాలు కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి పంపించి ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఫయాజ్ పరారీలో ఉన్నాడు.
Also read
- ఇన్స్టాగ్రామ్ పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!
- కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!
- Panchakshari Mantra: ఓం నమః శివాయకు ఇన్ని రూపాలున్నాయా? పంచాక్షరిలోని రకాల గురించి తెలుసా?
- కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!
- జనసేన నేత కోట రుక్మిణి రూ.7 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్





