Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో
మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. మాదాపూర్‌లోని గూగుల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారు నడుపుతూ, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేశారు. అంతటితో ఆగకుండా.. బస్సుకు అడ్డంగా కారును నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ గొడవ కాస్తా ముదిరి, యువకులు బస్సు డ్రైవర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. పట్టపగలే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు చూస్తుండగానే.. యువకులు ఆవేశంతో బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో వారు చేస్తున్న రచ్చను ఆపడానికి ప్రయత్నించిన వారిని కూడా యువకులు దుర్భాషలాడినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని, విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





