Hanumakonda: చిన్నపాటి డబ్బుల గొడవకు ప్రాణాలు తీసుకునే స్థాయికి స్నేహితులే దిగజారుతున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లాలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ప్రాణాంతక దాడికి దారితీసింది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఒక యువకుడు తన స్నేహితుడిపైనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హనుమకొండలోని గోపాల్పూర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివ కాలనీకి చెందిన రామ్ చరణ్ మరియు ఓంసాయి కాలనీకి చెందిన కార్తీక్ గత కొంతకాలంగా స్నేహితులుగా ఉన్నారు.
ఆదివారం రామ్ చరణ్, కార్తీక్ ఇద్దరూ కలిసి గోపాల్పూర్ చెరువు సమీపంలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య గతంలో ఉన్న 3 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీల ప్రస్తావన వచ్చింది. ఈ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్రస్థాయిలో ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన కార్తీక్, తన వద్ద ఉన్న కత్తితో రామ్ చరణ్ప విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రామ్ చరణ్ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
రామ్ చరణ్ కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు కార్తీక్ ఘటన అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న హనుమకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మద్యం మత్తు మరియు ఆర్థిక గొడవలే ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





