అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం అవుతున్నానని.. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని.. కొడాలి నాని పేరుతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం హాట్ ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరికొందరు వైసీపీ నేతలు సైతం ఇదే దారిలో పయనిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ ప్రకటనలు కూడా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కొడాలి నాని కూడా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను.
ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నాను. నన్ను ఎంతగానో ఆదరించిన గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని కొడాలి నాని ట్వీట్ చేసినట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే.. కొడాలి నాటి ట్విట్టర్ ఖాతాలో అలాంటి పోస్ట్ ఏదీ కనిపించలేదు. మీడియాకు సైతం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది ఫేక్ అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
Also Read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 
 





