ఏపీ మంగళగిరిలో ఘోరం జరిగింది. ట్రాన్స్‌జెండర్ నర్మదతో దీపక్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నర్మద ఫ్రెండ్ కోటేశ్వరరావు, దీపక్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరువు పోయినట్లు భావించిన దీపక్.. కోటేశ్వరరావును మర్డర్ చేయించాడు.
AP Crime: ఏపీలో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య మందలించినందుకు దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ కు తెలియడంతో పరువు పోతుందని భావించిన భర్త గుర్తు తెలియని వ్యక్తులతో మర్డర్ చేయించాడు. ఈ అమానుష ఘటన గుంటూర్ జిల్లాలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
డ్యాన్స్ ప్రొగ్రామ్ లో పరిచయం..
మంగళగిరి మండలానికి చెందిన కాశీనా ఈశ్వరరావు (కోటేశ్వరరావు) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో HIV పేషెంట్లకు మందులు ఇప్పించే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఓ డ్యాన్స్ ప్రొగ్రామ్ లో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి నర్మదతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గమనించిన దీపక్ భార్య కోటేశ్వరరావుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటినుంచి పరువు పోయినట్లు రగిలిపోతున్న దీపక్.. తమను కోటేశ్వరరావు దూరం చేస్తాడనే అనుమానంతో అతన్ని హత్య చేయించాడు. మంగళగిరి పెదవడ్లపూడి గ్రామ శివారులో బుధవారం రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు (కోటేశ్వరరావు)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు.. నర్మదను అదుపులోకి తీసుకుని పరారిలోవున్న నిందితుడు దీపక్ కోసం గాలిస్తున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




