చింతలపూడి: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరుజిల్లా చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది.
అదే గ్రామానికి చెందిన రాముడు (53) es బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





