అబ్బాయిలతో ఫోన్ మాట్లొడద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపింది ఓ చెల్లెల్లు. నాటకమాడి అందరినీ నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో చోటు చేసుకుంది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు 14 ఏళ్ల బాలిక తన అన్నని నరికి చంపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ వాడినందుకు మందలించడమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో తాను, తన అన్న మాత్రమే ఇంట్లో ఉన్నారని, ఇతర కుటుంబ సభ్యులు పనికి వెళ్లారని బాలిక పోలీసులకు తెలిపింది.
మొబైల్ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడుతున్నావని ఆరోపించిన సోదరుడు ఆమెను మందలించాడు. ఇకపై ఫోన్ వాడొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అతనిపై కోపం పెంచుకుంది. అన్న నిద్రిస్తుండగా, మెడపై గొడ్డలితో నరికేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అన్నయ్యను హత్య చేసిన అనంతరం ఏమీ ఎరుగనట్టుగా స్నానం చేసింది. తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. ఆ తరువాత తన సోదరుడి హత్య గురించి ఇరుగుపొరుగు వారికి తెలియజేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో బాలిక హత్యను అంగీకరించింది. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





