SGSTV NEWS
CrimeTechnology

Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌…ఆమె మరణానికి పూర్ణనే కారణం..?


యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్ణచందర్ వేధింపుల వ‌ల్లే స్వేచ్ఛ ఆత్మహ‌త్య కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచార‌ణ‌లో సైతం పూర్ణచంద‌ర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది

Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్ణచందర్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న స్వేచ్ఛ అతను పెళ్లికి నిరాకరించడం మూలంగానే మరణించిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె మరణానికి తాను కారణం కానంటూ లేఖ రాసిన పూర్ణచందర్‌ అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసుల విచారణలో బిగ్‌ ట్వి్స్ట్‌ నెలకొంది.

పూర్ణచందర్ వేధింపుల వ‌ల్లే స్వేచ్ఛ ఆత్మహ‌త్య కు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ విషయాన్ని పోలీసుల విచార‌ణ‌లో సైతం పూర్ణచంద‌ర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా స్వేచ్ఛతో కలిసి ఉంటున్న పూర్ణ పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేసిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకో అని పూర్ణచందర్ స్వేచ్ఛకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.అతను చేసిన మోసాన్ని గ్రహించిన స్వేచ్చ అత‌డి నుండి విడిపోదామ‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణచంద‌ర్ గొడ‌వ‌ప‌డిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా త‌మ కూతురు మృతికి పూర్ణచందరే  కార‌ణం అని ఆమె త‌ల్లిదండ్రులు ఆరోపించిన విషయ తెలిసిందే. పూర్ణచంద‌ర్‌కు వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మరోవైపు స్వేచ్ఛ కూమార్తె సైతం పూర్ణచందర్ పై సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణ చందర్ తనను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించింది. తన తల్లిని సైతం వేధించాడని చెప్పింది. దీనితో పూర్ణచందర్‌ పై పోక్సో కేసు నమోదు చేశారు.

అన్ని అన్నకు తెలుసు…పూర్ణ చందర్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఆయనను నేడు జడ్జి ముందు హాజరు పరచగా ఆయనకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పూర్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ సందర్భంగా పూర్ణచందర్ కన్ఫషన్ స్టేట్మెంట్‌లో సంచలన విషయాలు చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. స్టేట్‌మెంట్‌లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు పేరును పూర్ణ  ప్రస్తావించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తన గురించి, తన విషయాల గురించి సంతోషన్నకు అన్ని తెలుసునని  పోలీసులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

స్వేచ్ఛ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం కూడా ఆయనకు తెలుసని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. వారం రోజుల క్రితమే పూర్ణ చందర్, స్వేచ్ఛ కలిసి అరుణాచలం వెళ్లి వచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలో మరోసారి పెళ్లి విషయంపై స్వేచ్ఛ పూర్ణను నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వేచ్ఛ ఎదురు తిరగడంతో నన్ను ఏం చేయలేవు..నాకు రాజకీయ అండదండలు ఉన్నాయని పూర్ణచందర్ బెదిరించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

Also read

Related posts

Share this