పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్(24), సుల్లుబుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్‌కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది.
బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెనుకనే బెహరా అనుసరించింది. అటుగా వచ్చిన గూడ్స్ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





