స్థానిక కొనిజేటి మాల్యాద్రి చారిటబుల్ ట్రస్ట్ నందు నిర్వహించిన ఐ.యఫ్.టి.యు నిర్మాణ జనరల్ బాడీ సమావేశం లో ఐ.యఫ్.టి.యు “”నిడదవోలు ఏరియా కమిటీ “” ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.

అధ్యక్షులు:
పామర్తి సత్యనారాయణ
ఉపాధ్యక్షులు: నిచ్చెన కోళ్ళ దుర్గారావు, మల్లిడి రామిరెడ్డి
ప్రధాన కార్యదర్శి:
గెడ్డం రవీంద్ర బాబు
కార్యదర్శులు: మల్లిపూడి రామచంద్ర రావు, రవ్వ సురేష్ కుమార్
కోశాధికారి: పాఠం శెట్టి రాజేష్
కార్యవర్గ సభ్యులు: కోనేటి మల్లేశ్వర రావు, రాచర్ల సువర్ణ రత్నం, చేకూరి శ్రీనివాసరావు , రాము మరో ముగ్గురు కో ఆప్షన్ గాను ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన ఇఫ్టు పతాకావిష్కరణ నిడదవోలు ఏరియా కమిటీ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పని అమలుచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారనీ, సుప్రీంకోర్టు తీర్పు లను ధిక్కరించి మరీ కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల ను నియామకం చేస్తూ వారికి చట్ట పరమైన ఏవిధమైన రక్షణ లేని జీవితం లోకి నెడుతున్నారన్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల కు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం సభ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానాలు:
1) ఉపాధి హామీ పథకం గతంలో మాదిరిగానే నిర్వహించాలి.
2) కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ను క్రమ బద్దీకరించాలి.
3) భవన నిర్మాణ కార్మికుల కు ప్రమాదమరణ, అంగవైకల్య పరిహారాలు అమలు చేయాలి.
4) అసంఘటిత, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
పై కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బత్తిన చంద్రశేఖర్, దిడ్ల నరేష్, ఎల్లే రాజారావు , లంకాడ గణపతి, కోదాటి శ్రీనివాసరావు, హుస్సేన్, ఆలి, వెలిగట్ల శ్రీనివాసరావు తదితరులు నాయకత్వం వహించారు.
పామర్తి సత్యనారాయణ
అధ్యక్షులు
నిడదవోలు ఏరియా కమిటీ
ఐ. యస్.టి.యు
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





