మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న జాళ్లపాలెం గ్రామంలోని చిల్లర దుకాణంలో మే 28న మర్రిపూడి ఎస్ఐ రమేష్ సిబ్బందితో విచారణ పేరుతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చోరీ కేసులో సిసి కెమెరా విజువల్స్ కావాలంటూ షాపులో ప్రవేశించి, షాపు యజమాని అనుమతిని నిరాకరించడంతో మహిళలను తోసివేసి అసభ్యంగా ప్రవర్తించాడు.
మే 28వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా మహానాడుసభలో “రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే ఉపేక్షించేది ” లేదని చెప్పిన రోజే … ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో మహిళపై ఎస్ఐ దౌర్జన్యానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఓ చోరీ కేసు విషయంలో దగ్గరలోని షాపులో ఉన్న సిసి కెమెరా విజువల్స్ కావాలనే సాకుతో ఒక ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ మహిళపై దౌర్జన్యం చేసి చేయిచేసుకున్నాడంటూ బాధితులు ప్రకాశంజిల్లా ఎస్పికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు, అతని సిబ్బంది… మహిళలపై, తమ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవటమే కాకుండా దౌర్జన్యంగా సిసి కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్ళారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసంటే అంటూ.. ఎస్ఐ రమేష్ దుకాణంలోని మహిళపై దౌర్జన్యం చేస్తూ నెట్టివేస్తున్న దశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్ళపాలెం గ్రామంలో మారంరెడ్డి కొండలరావు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 27వ తేదిన పక్క గ్రామంలోని ఓ గుడిలో జరిగిన చోరీ కేసులో విచారణ చేస్తూ జాళ్ళపాలెం కూడలిలో ఉన్న కొండలరావు షాపు దగ్గరకు మర్రిపూడి ఎస్ఐ రమేష్ మరుసటి రోజు మే 28న తన సిబ్బందితో వచ్చారు. షాపు ముందు బిగించిన సిసి కెమెరా విజువల్స్ కావాలని షాపులో ఉన్న మహిళను, పిల్లలను అడిగారు… అయితే యజమాని కొండలరావు వేరే ఊరికి వెళ్ళినందున తాను వచ్చిన తరువాత ఇస్తానని ఫోన్లో ఎస్ఐ రమేష్‌కు తెలిపాడు.
గతంలో ఓ కేసు విషయంలో ఎస్ఐ రమేష్ తనకు అన్యాయం చేయడాన్ని కూడా ఫోన్ కాల్లో ప్రస్తావించారడు కొండలరావు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్ఐ రమేష్ పోలీసులకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందంటూ ఆ సమయంలో షాపులో ఉన్న మహిళను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. అడ్డుపడిన మహిళలను తోసివేసి దౌర్జన్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు షాపులోని సిసి కెమెరాలో రికార్డయ్యాయి… అనంతరం షాపులోని సిసి కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్ళడమే కాకుండా షాపులో ఉన్న మహిళపై చేయిచేసుకున్న మర్రిపూడి ఎస్ఐ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని షాపు యజమాని కొండలరావు జిల్లా ఎస్పి దామోదర్‌కు వాట్సప్‌లో పిర్యాదు చేశాడు. ఎస్ఐ దౌర్జన్యం చేస్తున్న సిసి కెమెరా విజువల్స్‌తో పాటు ఫిర్యాదును పంపించాడు… తమపై దౌర్జన్యం చేసిన మర్రిపూడి ఎస్ఐ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..