మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని మూతి పళ్ళు రాలగొట్టిన ఘటన పుల్లంపేటలో చోటు చేసుకుంది. పుల్లంపేటలో మద్యం సేవించి ఆటోతో స్కూటర్ ను ఢీకొన్న ముగ్గురు యువకులను మందలించిన వీఆర్వో సుబ్బరాయుడు పై ముగ్గురు యువకులు దాడి చేసి విచక్షణ రహితంగా మూతి పళ్ళు రాల గొట్టి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే..
కడప, ఏప్రిల్ 30: కడప జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం విఆర్వో సుబ్బరాయుడుపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మూడు మూతి పళ్ళు రాలి పోయాయి. VRO భోజనం ముగించుకుని కార్యాలయం బయట రోడ్డు పక్కన స్కూటర్ ను ఆపి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు మద్యం సేవించి ఆటోతో విఆర్వో సుబ్బ రాయుడు స్కూటర్ ను ఢీ కొన్నారు.
దీంతో ఆగ్రహించిన సుబ్బ రాయుడు ఏరా తాగి ఉన్నారా? అని మందలించాడు. మత్తులో ఉన్న యువకులు విఆర్వో సుబ్బరాయుడు పైదాడి చేశారు. ఈ దాడిలో విఆర్వో సుబ్బరాయుడు మూడు మూతి పళ్ళు రాలిపోవడంతో పాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





