మాస ఫలాలు (మే 1-31, 2026): మేష రాశి వారికి నెల రోజుల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రవి, కుజ, రాహు, శుక్ర గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెల రోజుల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందు తారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశిలో శుక్రుడు, ధన స్థానంలో గురు సంచారం, లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కీలక విషయాల్లో నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, రవి, కుజ, బుధ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు, సూచ నలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధి స్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రవి, శుక్రుల అనుకూలత వల్ల నెలంతా ఆదాయపరంగా బాగానే గడిచిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు పూర్తవుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడితో పాటు శుక్ర, రాహువుల అనుకూలత వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు కూడా కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబపరంగా అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ నెలంతా రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురు, కుజ, శని గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగులోకి వస్తాయి. సామాజికంగా ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయం వృద్ది చెందుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్న రాశ్యదిపతి కుజుడు రెండవ వారంలో స్వస్థానమైన మేష రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి నెలంతా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కీలక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రాశ్యధిపతి గురువుతో పాటు కుజ, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు తగ్గి, లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని, పంచమంలో శుక్రుడు, రవి బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గు తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమా చారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థికంగా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యో గులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రాశ్యధిపతి శని ధన స్థానంలో, ధనాధిపతి గురువు పంచమంలో, శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా అధికమవుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపం దుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువుతో పాటు కుజ, బుధుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందివచ్చే అవకాశముంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకపోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు.
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..
- ఎంత దారుణం..! భార్య పరువు కోసం
- విశాఖ ఎక్స్ ప్రస్ అత్యాచార కేసులో ట్విస్ట్
- రక్షక భటుడే భక్షకుడైతే..? ఖాకీ ముసుగులో కామాంధుడు.. బాధితురాలిపై సీఐ అఘాయిత్యం!
- ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుందా? అపరాజిత దేవి రహస్యం!
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?









