పెనుకొండ, రొద్దం, : ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో చోటుచేసుకుంది. నారనాగేపల్లి గ్రామానికి చెందిన జవాన్ అజబ్‌రెడ్డి, కల్పన దంపతుల కుమారులు దరహాన్రెడ్డి (13), హర్షిత్‌రెడ్డి (10) అనంతపురంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అజయ్ రెడ్డి మణిపుర్లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వేసవి సెలవుల కోసం అందరూ స్వగ్రామానికి వచ్చారు. రాప్తాడు మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామానికి సుధాకర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులకు సృజన్‌రెడ్డి (13), కుమార్తె సంతానం. ఆరేళ్ల క్రితం శ్రీదేవి భర్త అనారోగ్యంతో మరణించగా, పిల్లలతో కలిసి ఆమె పుట్టినిల్లు నారనాగేపల్లిలో నివసిస్తున్నారు. దరహాస్ రెడ్డి,హర్షిత్‌రెడ్డి, సృజన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం నేరేడు పండ్ల కోసం పొలాల్లోకి వెళ్లారు. పండ్లు కోసుకొని నీటికుంట వైపు వస్తుండగా అందులో జారిపడ్డారు. సమీప పొలాల్లోని వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీశారు. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డలు విగతజీవులుగా మారడంతో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





