SGSTV NEWS
Andhra PradeshCrime

అమరావతి: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు… కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో



ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్లు, భవనాల నిర్మాణాల్లో ఉపయోగించేందుకు భారీ యంత్ర పరికరాలు, జేసిబిలు, ప్రొక్లేనర్లు రాజధానిలోకి వచ్చాయి. ఈ యంత్రాలకు ఇతర రాష్ట్రాల డ్రైవర్లను నియమించారు. అయితే డీజిల్ దొంగతనాలు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా


ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులతో పాటు ఇతర భవనాల నిర్మాణం జరుగుతోంది. దీంతో రాజధానిలోకి పెద్ద ఎత్తున యంత్ర పరికరాలు వచ్చాయి.  జేసిబిలు, ప్రొక్లెనర్లు, భారీ క్రేన్లను నిర్మాణ కంపెనీలు తీసుకొచ్చాయి. నిర్మాణ కంపెనీలతో పాటు స్థానికులు కూడా పెద్ద పెద్ద యంత్ర పరికరాలను కొనుగోలు చేసి రెంట్ బేస్ మీద తిప్పుతున్నారు.

ఈ పెద్ద పెద్ద యంత్రాల్లో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి వర్కర్లు వచ్చారు. వీరంతా రాజధాని గ్రామ సమీపంలోనే నివసిస్తున్నారు. రాయపూడికి చెందిన చక్రవర్తి అనే వ్యక్తి ప్రొక్లెనర్లు, జెసిబిలు కొనుగోలు చేశారు. వాటిని నడిపేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని డ్రైవర్లుగా నియమించుకున్నారు. అయితే ఈ ప్రొక్లైనర్లు, జేసిబిల్లో డిజీల్ చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతోంది. దీంతో వేల రూపాయలు వెచ్చించి డీజిల్ నింపుతున్నారు. కొంతమంది తాము పనిచేసే ఓనర్ల వద్దే నమ్మకంగా ఉంటూ డీజిల్ కాజేస్తున్నారు. వంద లీటర్ల వరకూ తీసి విక్రయించుకుంటున్నారు. దీంతో ఇంటి దొంగలను పట్టుకోవడం కష్టంగా మారిపోయింది.

అయితే కొత్తగా వస్తున్న వెహికల్స్‌ను సెల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవడంతో వెహికల్ మూమెంట్‌తో పాటు ఎప్పుడూ ఎటువంటి మార్పులు చేర్పులు చేసినా ఓనర్‌కు ఇట్టే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చక్రవర్తి వద్ద పనిచేసే డ్రైవర్లు తాము నడిపే వెహికల్స్ నుంచి డీజిల్ తీస్తున్న సమయంలో సెల్ ఫోన్‌కు మెస్సెజ్ వచ్చింది. దీంతో వెంటనే చక్రవర్తి జేసిబిలు, ప్రొక్లైనర్స్ నిలిపి ఉంచిన షెడ్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో డీజిల్ చోరీ ఉన్న డ్రైవర్లు ఓనర్‌ను చూసి అవాక్కయ్యారు. వెంటనే స్థానికులతో కలిసి చక్రవర్తి ముగ్గురుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాదాపు వంద లీటర్ల డీజిల్ తీసి ఆ క్యాన్లను తాముంటున్న షెడ్స్ లో దాచిపెట్టారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


భారీ యంత్రాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజధానిలో ఇంకా పెద్ద ఎత్తున యంత్రాలు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇటువంటి కొత్త తరహా దొంగతనాలు జరిగే అవకాశం ఉందని.. దీంతో ముందుగా యజమానులను హెచ్చరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share this