ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఒకవేళ తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ కత్తి పట్టుకుని వారింటికి వెళ్లి మరి బెదిరింపులకు దిగాడు ఆ యువకుడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆకతాయిల తీరు మారటం లేదు. యువతులను మానసికంగా వేదిస్తూ ఉన్నారు. తాజగా ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఒకవేళ తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ కత్తి పట్టుకుని వారింటికి వెళ్లి మరి బెదిరింపులకు దిగాడు ఆ యువకుడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ పోలీస్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వేధింపులను మౌనంగా భరించకండని, సోషల్ మీడియాలో కానీ, నేరుగా గానీ ఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురిచేసినా, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినా తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. లేదా 100కు డయల్ చేయండి.. మీకు సహాయం చేసేందుకు తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని కీలక సూచనలు చేశారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది
కాగా, హైదరబాద్‌లోని కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు ప్రాంతానికి చెందిన షేక్‌ఇర్షాద్ అలియాస్ పాషా నింబోలి అడ్డాలో నివసించే మరో మతానికి చెందిన 17 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఇటీవల ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ విషయాన్ని యువతి వీహెచ్‌పీ నేతలకు కూడా చెప్పడంతో వారంతా స్టేషన్ కు చేరుకున్నాడు. కాగా వారిలో ఒకరి పట్ల యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వీహెచ్‌పీ నేత చొక్కా పట్టకోవడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇర్షాద్ తల్లి సైతం ఎంఐఎం నేతలకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయడంతో వారు కూడా స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడినుంచి పంపించివేసి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





