పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పాటు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపైనా పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా నరసరావుపేట టూ టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో…
ఒకదాని తర్వాత ఒకటి.. రప్పా.. రప్పా.. కేసులు వెంటాడుతూనే ఉన్నాయ్..! చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్ ఏపీ యాత్ర తప్పేలా లేదు..! ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో.. PT వారెంట్లపై ఆయన్ను ఆయా PSలకు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు రాజంపేట జైలు నుంచి ఆయన్ను నరసరావుపేట తరలిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది..!
రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30 పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్గా మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకి వెళ్లారు. గుంటూరుజిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పోసానిని అప్పగిస్తే తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారట.
మూడు జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో.. ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు.. పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పోసానితో పాటు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని ఒక మూర్ఖుడు. పోసాని లాంటి వాళ్లతో అప్పుడు తిట్టించి ఇప్పుడు గగ్గోలు పెడతారా? అని నిలదీశారు. తప్పు చేసిన వాళ్లను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





